శీతాకాల విడిదిలో భాగంగా ఈ నెల 22న హైదరాబాద్ కు రాష్ట్రపతి రానున్నారు..

- December 07, 2016 , by Maagulf
శీతాకాల విడిదిలో భాగంగా ఈ నెల 22న హైదరాబాద్ కు రాష్ట్రపతి రానున్నారు..

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దక్షిణాది రాష్ట్రాల శీతాకాల విడిదిలో భాగంగా ఈ నెల 22న హైదరాబాద్ రానున్నారు. 22 నుంచి 31 వరకు ఆయన సికింద్రాబాద్ బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. వారం రోజుల పాటు రాష్ట్రపతి ఇక్కణ్నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తారు. దక్షిణాది రాష్ట్రాల పర్యటనలకు వెళ్లడంతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా ముందస్తు అనుమతితో వివిధ రంగాల ప్రముఖులు, రాజకీయ నేతలు రాష్ట్రపతిని కలుసుకుంటారు. రాష్ట్రపతి హైదరాబాద్ పర్యటన ఖరారైనట్లు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ వర్గాలు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా సమాచారం చేరవేశారుు.

22న సాయంత్రం 5.30కు ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకుంటారు. 

23న మధ్యాహ్నం హెచ్‌ఐసీసీలో ఫ్యాఫ్సీ అధ్యర్యంలో జరిగే సదస్సుకు హాజరవుతారు. 26న మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. 27న రాజ్‌భవన్‌లో గవర్నర్ ఇచ్చే విందుకు హాజరవుతారు. 29న ఉదయం తిరువనంతపురంలో జరిగే ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సమావేశాలకు హాజరవుతారు. అదే రోజున మైసూరులో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్‌స జాతీయ సమ్మేళనంలో పాల్గొంటారు. అదేరోజు రాత్రి హైదరాబాద్‌కు తిరిగి వస్తారు. 30న రాష్ట్రపతి నిలయంలో ప్రభుత్వ ప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు, వీఐపీలకు విందు ఏర్పాటు చేస్తారు. 31వ తేదీ మధ్యాహ్నం ఢిల్లీకి తిరుగు పయనమవుతారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com