బావిలో రెండేళ్ళ చిన్నారి మృతదేహం
- December 08, 2016
మస్కట్: రెండేళ్ళ చిన్నారి మృతదేహం సమాయిల్ ప్రావిన్స్ - దక్లియా గవర్నరేట్‌లోని ఓ బావిలో కనుగొనబడింది. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఎసిడిఎ) వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. సోమవారం మధ్యాహ్నం నుంచి చిన్నారి కనిపించకుండా పోయాడు. ఉదయం 8.45 నిమిషాల సమయంలో పిఎసిడిఎ రెస్క్యూ టీమ్ బాలుడి మృతదేహాన్ని అతని కుటుంబం నివసిస్తోన్న ఇంటికి సమీపంలో ఉన్న ఫామ్‌లోగల బావిలోకనుగొంది. ఆగస్ట్‌లోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. సముద్రంలో, వాడిస్‌లో, బావుల్లో చిన్నారులు చనిపోయిన ఘటనలు 2014లో ఆరు నమోదు కాగా, 2015లో 7 ఘటనలు నమోదయ్యాయి. ఒమన్‌లో ఇలా మునిగిపోవడం అనే కేసులు సాధారణంగా మారిపోయాయి. హెచ్చరికల్ని ప్రజలు బేఖాతరు చేస్తుండడం ఈ ప్రమాదాలకు ముఖ్య కారణం. చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఇంకా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!







