ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా దొంగల అరెస్ట్
- December 08, 2016మనామా: ఓ జ్యూస్ బాటిల్‌పై ఫింగర్ ప్రింట్స్, అలాగే సిసిటివి ఫుటేజ్ ఆధారంగా చేసుకుని, మనామా కోల్డ్ స్టోర్స్‌లో దోపిడీకి పాల్పడ్డ ఇద్దరు వ్యక్తుల అరెస్ట్‌కి మార్గం సుగమం అయ్యింది. మనామాలోని అబుల్ ఘాజల్ ఏరియాలోని పలు స్టోర్స్‌లో ఆయుధాలు ధరించిన వ్యక్తులు దోపిడీలకు పాల్పడుతున్నారు. వరుసగా ఒకదాని తర్వాత ఒక కోల్డ్ స్టోర్‌ని దోపిడీ చేస్తూ వచ్చారు. మొదటి రెండు కోల్డ్ స్టోర్స్‌లో ఎలాంటి సిసిటివి లేకపోవడంతో నిందితుల ఆచూకీ కష్టమయ్యింది. అయితే మూడో స్టోర్‌లో ఉన్న సిసిటివి ఫుటేజ్‌తో నిందితులు ఎవరన్నదీ తెలుసుకోగలిగారు. అరెస్టు చేసిన దొంగల్ని అదుపులోకి తీసుకుని, జైలుకు తరలించారు. నిందితుల్లో ఒక వ్యక్తి జూస్ బాటిల్‌ని చేత్తో పట్టుకోవడంతో దానిపై ఏర్పడ్డ ఫింగర్ ప్రింట్స్‌తో నేరారోపణ సులభతరమయ్యింది. ఆ వ్యక్తుల నుంచి కారుని, అలాగే ఓ కత్తిని, కొంత మొత్తంలో డబ్బునీ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అన్ని స్టోర్స్‌లోనూ విధిగా సిసిటివిలను ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







