మరణ శిక్ష పడ్డ 10 మంది భారత యువకులకు కాన్సులర్ సాయం
- December 08, 2016
అబుదాబీ: అబుదాబీలోని ఇండియన్ ఎంబసీ, 10 మంది భారతీయ యువకులకు కాన్సులర్ అసిస్టెన్స్ అందిస్తోంది. పాకిస్తానీ వ్యక్తిని హత్య చేసిన ఘటనలో ఈ పది మంది భారతీయ యువకులకు మరణ శిక్ష పడింది. కింది కోర్టు ఈ నెల మొదట్లో ఆ వ్యక్తులకు మరణ శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో ఆ యువకులకు కాన్సులర్ అసిస్టెన్స్ ఇచ్చేందుకు ముందుకొచ్చినట్లు ఎంబసీ కౌన్సెలర్ కమ్యూనిటీ వెల్‌ఫేర్ - దినేష్ కుమార్ చెప్పారు. అల్ అయిన్ జైలులో ఉన్న ఆ వ్యక్తుల్ని ఇటీవల తాను కలిసినట్లు కుమార్ చెప్పారు. తమ ప్రయత్నాలు ఫలించి, వారికి క్షమాభిక్ష లభిస్తుందనే ఆశాభావంతో ఉన్నట్లు కుమార్ వెల్లడించారు. ఒకవేళ క్షమాభిక్ష లభిస్తే, మొత్తం 11 మంది నిందితులు 200,000 దిర్హామ్‌లు బాధిత కుటుంబానికి యూఏఈ చట్టాల ప్రకారం అందించవలసి ఉంటుంది. నిందితుల్లో చాలామంది ట్వంటీస్‌లోనే ఉన్నారు.
తాజా వార్తలు
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం







