ఫింగర్‌ ప్రింట్స్‌ ఆధారంగా దొంగల అరెస్ట్‌

- December 08, 2016 , by Maagulf
ఫింగర్‌ ప్రింట్స్‌ ఆధారంగా దొంగల అరెస్ట్‌

మనామా: ఓ జ్యూస్‌ బాటిల్‌పై ఫింగర్‌ ప్రింట్స్‌, అలాగే సిసిటివి ఫుటేజ్‌ ఆధారంగా చేసుకుని, మనామా కోల్డ్‌ స్టోర్స్‌లో దోపిడీకి పాల్పడ్డ ఇద్దరు వ్యక్తుల అరెస్ట్‌కి మార్గం సుగమం అయ్యింది. మనామాలోని అబుల్‌ ఘాజల్‌ ఏరియాలోని పలు స్టోర్స్‌లో ఆయుధాలు ధరించిన వ్యక్తులు దోపిడీలకు పాల్పడుతున్నారు. వరుసగా ఒకదాని తర్వాత ఒక కోల్డ్‌ స్టోర్‌ని దోపిడీ చేస్తూ వచ్చారు. మొదటి రెండు కోల్డ్‌ స్టోర్స్‌లో ఎలాంటి సిసిటివి లేకపోవడంతో నిందితుల ఆచూకీ కష్టమయ్యింది. అయితే మూడో స్టోర్‌లో ఉన్న సిసిటివి ఫుటేజ్‌తో నిందితులు ఎవరన్నదీ తెలుసుకోగలిగారు. అరెస్టు చేసిన దొంగల్ని అదుపులోకి తీసుకుని, జైలుకు తరలించారు. నిందితుల్లో ఒక వ్యక్తి జూస్‌ బాటిల్‌ని చేత్తో పట్టుకోవడంతో దానిపై ఏర్పడ్డ ఫింగర్‌ ప్రింట్స్‌తో నేరారోపణ సులభతరమయ్యింది. ఆ వ్యక్తుల నుంచి కారుని, అలాగే ఓ కత్తిని, కొంత మొత్తంలో డబ్బునీ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అన్ని స్టోర్స్‌లోనూ విధిగా సిసిటివిలను ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com