షార్జాలో పదిమంది కార్మికులపై దూసుకువెళ్లిన బస్సు ఒకరు మృతి
- December 09, 2016
జన్మభూమిని..కుటుంబసభ్యులను వదలి ఎడారి దేశాలలో కొలువు కోసం వచ్చిన వారు ఒక రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. షార్జాలో ఒక బస్సు ఉద్యోగుల సమూహం మీదకు దూసుకుపోయింది. ఒక వ్యక్తి మరణించగా,మరో తొమ్మిది మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రమాదానికి గురైన కార్మికులలో ఎనిమిది మంది భారతీయులు, ఇద్దరు పాకిస్థానీయులు ఉన్నారు. అల్ హంరియా ప్రాంతంలో ఒక రహదారి పక్కన వారు వేచి ఉన్న సమయంలో ఒక బస్సు వారిపై నుంచి వేగంగా దూసుకుపోయింది. ఈ దుర్ఘటనలో క్షతగాత్రులందర్నీ ఖలీఫా ఆస్పత్రికి తరలించారు అయితే వీరిలో ఒక 34 ఏళ్ల కార్మికుడు మరణించాడు ప్రమాదం జరిగిన విషయం పోలీసులకు తెలియడంతోనే పెట్రోల్ బృందం ట్రాఫిక్ నిపుణులు మరియు అంబులెన్సులను ప్రమాద స్థలానికి తరలించారు. కాగా ఈ ప్రమాదానికి కారకుడైన ఆసియా దేశానికి చెందిన డ్రైవర్ ను అదుపు లోనికి తీసుకున్నారు. మరణించిన కార్మికుని శరీరాన్ని మృతదేహాలను భద్రపరిచే గదికి తరలించబడింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







