పంజాబ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం ....13మంది ఉపాధ్యాయులు మృతి

- December 09, 2016 , by Maagulf
పంజాబ్‌లో  ఘోర రోడ్డు ప్రమాదం ....13మంది ఉపాధ్యాయులు మృతి

 పంజాబ్‌లో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. 15మందితో వెళ్తున్న జీపు.. ట్రక్కును ఢీకొన్న ఘటనలో 13 మంది అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన ఫజిల్‌కా జిల్లా కేంద్రానికి 9 కిలోమీటర్ల దూరంలోని చందీపూర్‌ వద్ద చోటుచేసుకుంది. మృతులంతా ప్రభుత్వ ఉపాధ్యాయులే. వీరిలో ఐదుగురు మహిళలున్నారు.ఉదయం విధులకు హాజరయ్యేందుకు వీరంతా జీపులో బయలుదేరారు. దట్టమైన పొగమంచు కారణంగా రోడ్డు సరిగా కనిపించకపోవడంతో వీరు ప్రయాణిస్తున్న వాహనం లారీని ఢీకొన్నట్లు ప్రత్యక్షసాక్షి తెలిపారు.ప్రమాద సమయం నుంచి ఇద్దరు ప్రాణాలతో బయటపడగా..వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతదేహాలను జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వ అధికారులు, స్థానిక నేతలు సంఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఉపాధ్యాయులు మృతికి సంతాపంగా స్థానికులు స్వచ్ఛంద బంద్‌కు పిలపునిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com