కిడ్నీ మార్పిడిశస్త్రచికిత్స పూర్తిచేసిన ఎయిమ్స్ వైద్యులు
- December 10, 2016
కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు శనివారం దిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడిశస్త్రచికిత్స చేశారు. ఎయిమ్స్ డైరెక్టర్ ఎంసీ మిశ్రా, శస్త్రచికిత్స నిపుణులు వీకే బన్సల్, వి శ్రీను, నెఫ్రాలజిస్ట్ సందీప్ మహాజన్ బృందం నేతృత్వంలో ఆమెకు ఐదు గంటల పాటు శస్త్రచికిత్సను విజయవంతంగా చేశారు. ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో సర్జరీ ప్రారంభం కాగా మధ్యాహ్నం 2.30గంటలకు ముగిసిందని, ఆపరేషన్ తర్వాత మంత్రిని ఐసీయూకి తరలించినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. మంత్రికి కిడ్నీని దానం చేసిన దాత వివరాలు గోప్యంగా ఉంచారు. 64 ఏళ్ల సుష్మ చాలాకాలంగా మధుమేహంతో బాధపడుతున్నారు.
మూత్ర పిండాల పనితీరు దెబ్బతిన్నప్పటినుంచి ఆమెకు వారానికి మూడుసార్లు డయాలసిస్ చేస్తున్నట్లు ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. నవంబరు 16న తన అనారోగ్యం గురించి సుష్మ స్వయంగా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నానని, కిడ్నీ మార్పిడికి సన్నాహాలు జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. అది తెలవగానే సుష్మకు కిడ్నీ దానం చేస్తామంటూ పలువురు దాతలు ముందుకు వచ్చారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









