పార్లమెంటు ప్రతిపక్షాలకు గుజరాత్ లో జవాబిచ్చిన మోడీ
- December 10, 2016
గుజరాత్ లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు. లోక్ సభలో మాట్లాడనివ్వడంలేదనీ అందుకే తను జనసభలో మాట్లాడుతున్నానంటూ పార్లమెంటులో ప్రతిపక్షాల చేస్తున్న ఆందోళనపై విరుచుకుపడ్డారు. పేదల వికాసం కోసమే పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. అవినీతికి వ్యతిరేకంగా, నల్ల డబ్బు కు వ్యతిరేకంగా, నకిలీ కరెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నట్టు మోదీ చెప్పారు. గుజరాత్‌లో దీసాలో శనివారం ఓ సభలో మోదీ పెద్ద నోట్ల రద్దును పూర్తిగా సమర్థించుకన్నారు. దేశాన్ని పట్టిపీడిస్తోన్న నల్లధనాన్ని నియంత్రించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల ముందు నిలబడి సమయాన్ని వృథా చేసుకోవాల్సిన అవసరం లేదని, బ్యాంకర్లు ఈ-వ్యాలెట్‌ల ద్వారా బ్యాంకులనే మీ మొబైల్ ఫోన్లలోకి తీసుకొచ్చారని చెప్పారు.
వాటిని ఉపయోగించుకుంటూ నగదురహిత లావాదేవీలు జరపాలని పిలుపునిచ్చారు. నల్లధనం దాచుకున్న అక్రమార్కులు ఒక్కరు కూడా తప్పించుకోవడానికి వీల్లేదని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. తాము అధికారంలోకి వచ్చాక రైతుల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చామని అన్నారు. నన్ను విమర్శించండి...కానీ నగదు రహిత లావాదేవీలు, మొబైల్ బ్యాంకింగ్ పై ప్రజలకు అవగాహన క్పలించాలని ప్రతిపక్షాల్నికోరారు.
నల్లధనంపై పోరులో 50 రోజులు గడువు అడిగాం.. ఇపుడు ఎలాంటి మార్పులు వస్తున్నాయో మీరు చూస్తున్నారని మోదీ చెప్పారు. నకిలీ కరెన్సీని, అవినీతిని దేశం ఎట్టి పరిస్తితుల్లోనూ సహించదు. ఈ విషయంలో మీ దీవెనలు కావాలంటూ ప్రజలనుద్దేశించి మోదీ కోరారు. ఇపుడు ప్రజల శక్తి బలం పెరుగుతోంది. రూ.100నోట్లను సరఫరాను పెంచామంటూ ప్రధాని ప్రసంగిచారు.
తాజా వార్తలు
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్







