ప్రపంచంలోనే పొడవైన సొరంగ మార్గంలో రైళ్ల రాకపోకలు ప్రారంభo...

- December 11, 2016 , by Maagulf
ప్రపంచంలోనే పొడవైన సొరంగ మార్గంలో రైళ్ల రాకపోకలు ప్రారంభo...

ప్రపంచంలోనే పొడవైన సొరంగ మార్గంలో రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. స్విట్జర్లాండ్‌లోని ఆల్ప్స్‌ పర్వతాల్లో రూ.78 వేల కోట్ల వ్యయంతో, 17 ఏళ్ల పాటు నిర్మించిన నిర్మించిన 57 కి.మీ. పొడవైన ఈ గొథార్డ్‌ బేస్‌ టన్నెల్‌(జీబీటీ)ను జూన్‌లో ప్రారంభించారు. తాజాగా ఆదివారం నుంచి ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. జీబీటీలో తొలిసారి ప్రయాణికుల రైలు జ్యూరిచ్‌ నుంచి లుగానోకు వెళ్లింది. తర్వాత స్థానాల్లో జపాన్‌లోని సీకాన్‌ సొరంగం (53.9 కి.మీ.), బ్రిటన్‌, ఫ్రాన్స్‌లను కలిపే ఛానెల్‌ సొరంగ మార్గాలు (50.5 కి.మీ.) ఉన్నాయి. .

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com