బహ్రెయిన్ లో దేశీయంగా తయారైన బాంబులు- అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

- September 04, 2015 , by Maagulf
బహ్రెయిన్ లో దేశీయంగా తయారైన బాంబులు- అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

గత కొన్ని సంవత్సరాలుగా బహ్రైన్ లో వేర్పాటువాద శక్తులు ఆధునిక ప్రేలుడు పదార్ధాలను స్థానికంగానే తయారుచేసి పాతిపెడుతున్నారని బహ్రైన్ లో బ్రిటిష్ బాంబుల నిర్వీర్య నిపుణుడు అంథోనీ జార్ తెలియజేశారు. జులై 28 మరియు అగస్ట్ 28 లలో వరుసగా సిట్ర మరియు కరన్నాలలో పేలిన బాంబులు ముగ్గురు పోలీసులను బలిగొని, మరి 13 మందిని గాయపర్చిన అనంతరం సంఘటనలపై స్పందిస్తూ ఈ బాంబులను మొబైల్ ఫోన్ లేదా కేవలం ఒక వైర్ లెస్ పరికరం ద్వారానైనా కూడా పనిచేయించవచ్చని, ఈ తయారీ పదార్ధాలు దైనందిన జీవితంలో కూడా వాడేవైనందున వాటిని నిషేధించలేమని అన్నారు. వాటిని సమిష్టికృషి, ప్రయత్నాల ద్వారానే నిరోధించగలమని ఆయన స్పష్టం చేశారు. ఈ విధమైన అనుమానాస్పద పరికరాలు కానీ సంఘటనలు కానీ గమనించినపుడు హాట్ లైన్ నంబర్ - 80008008 కు సమాచారమీయవలసిందిగా ప్రజలను  రక్షణ శాఖ అధికారులు కోరారు.


--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com