ముందుగా బయలుదేరoడి - ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించండి

- September 04, 2015 , by Maagulf
ముందుగా బయలుదేరoడి - ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించండి

నూతన విద్యా సంవత్సరం ఆదివారం ప్రారంభమవడం, సెలవులనుండి తిరిగి వస్తున్న స్థానికులు, రోడ్డు నిర్మాణ పనులు వీటన్నిటి వలన ఎదురయ్యే పెద్ద క్యూలు, ఇబ్బందులను అధిగమించడానికి దోహా ప్రజలకు ఆంతరంగిక శాఖ వారు సూచనలు చేశారు. పరిస్థితిని అంచనా వేయడానికి నేడు లేదా రేపు ఒక టెస్ట్ డ్రైవ్ వేయడం ద్వారా, మార్గంలో ఏవైనా మళ్లింపులు, ఆటంకాలు వంటివాటిని గమనించవచ్చు; అధిక రద్దీ ఉండే అవకాశమున్నందువలన, వీలైనంత త్వరగా బయలుదేరడం, సమీపంలో ఉన్న పిల్లలను పూలింగ్ ద్వారా తీసుకొని వెళ్ళడం వల్ల తమవంతు సహకారమందిoచినట్లు అవుతుందని వారు తెలిపారు. ఫీఫా 2012 వల్డ్ కప్ కు సంబంధించిన అభివృద్ధి పనులు జరుగుతున్నందున మళ్లింపులను నివారించలేమని, ప్రజలు భాద్యతకలిగి, శాంతియుతంగా ఉండాలని వారు విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా, ప్రత్యేకించి తల్లిదండ్రులకు స్కూలు ముగిసిన అనంతరం వెంటనే కాకుండా తమ పిల్లలను కాస్త నిదానంగా తీసుకురావడం ద్వారా ట్రాఫిక్ జాం లనుండి తప్పించుకోవచ్చని వారు సూచించారు.


--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com