జెట్ ఎయిర్‌వేస్ వినూత్న సేవలు
- December 12, 2016
కార్లు, టీవీలు, ఏసీలు, స్మార్ట్‌ఫోన్లే కాదు.. ఇప్పుడు విమాన టికెట్‌ను కూడా ఈఎంఐ ఆప్షన్‌లో పొందొచ్చు. ప్రముఖ విమానయాన సంస్థ 'జెట్ ఎయిర్‌వేస్' తాజాగా విమాన ప్రయాణానికి ఈఎంఐ ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. సంస్థ దీనికోసం పలు బ్యాంకులతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. 'రూ.500, రూ.1,000 నోట్ల రద్దు నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో క్రెడిట్ కార్డు ద్వారా ఈఎంఐ విధానంలో జరిగే లావాదేవీలు పెరుగుతున్నాయి.అందుకే ప్రయాణికులకు మేం కూడా ఈఎంఐ పేమెంట్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చాం' అని జెట్ ఎయిర్‌వేస్ చీఫ్ కమర్షియల్ అధికారి జయరాజ్ వివరించారు.సంస్థ వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లో విమాన టికెట్‌ను బుకింగ్ చేసుకునే సమయంలో యాక్సిస్, హెచ్‌ఎస్‌బీసీ, ఐసీఐసీఐ, ఇండస్‌ఇండ్, కొటక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకుల క్రెడిట్ కార్డులను కలిగిన వారికి ఈఎంఐ పేమెంట్ ఆప్షన్ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈఎంఐ చెల్లింపుల గడువు 3, 6, 9, 12 నెలలుగా ఉంటుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







