దుబాయ్ అంతర్జాతీయ ఆర్ధిక కేంద్రం లో మరో 100 భారతీయ కంపెనీలు

- September 04, 2015 , by Maagulf
దుబాయ్ అంతర్జాతీయ ఆర్ధిక కేంద్రం లో మరో 100 భారతీయ కంపెనీలు

ఇటీవల ప్రకటించిన 2024 అభివృద్ధి పధకం ప్రకారం DIFC, రానున్న 10 సంవత్సరాలలో భారతీయ కంపెనీల సంఖ్యను మరో 100 వరకు పెంచడానికి నిర్ణయించుకుంది. భారత ప్రధాని నరేంద్ర మోడి, యూ. ఏ. ఈ. ని సందర్శించిన అనంతరం ఈ వ్యూహాత్మక చర్య తీసుకోబడడం గమనార్హం! ఈ కేంద్రంలోని ఆర్ధిక సంస్థలలో భారత్ మూడవ అతిపెద్దదిగా అవతరించింది. ఈ సందర్భంగా సంస్థ డేప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆరిఫ్ అమీరీ, తమ 10 సంవత్సరాల అభివృద్ధి వ్యూహం యొక్క అమలును గురించి మాట్లాడుతూ, ఈ సంవత్సరం తమ  ముంబాయి పర్యటనలో, ఇపుడీపుడే వేగం పుంజుకుంటున్న భారతీయ మార్కెట్ తో చిరకాల భాగస్వామ్య నిర్మాణానికి, కొనసాగించడానికి DIFC కృషిని వివరించామని ఆయన తెలిపారు.

 

--సి.శ్రీ(దుబాయ్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com