తొలిసారి డ్రోన్‌ ద్వారా డోర్‌ డెలివరీ చేసిన అమెజాన్

- December 16, 2016 , by Maagulf
తొలిసారి డ్రోన్‌ ద్వారా డోర్‌ డెలివరీ చేసిన అమెజాన్

ఆన్‌లైన్‌ వ్యాపార దిగ్గజం.. అమెజాన్‌ సరికొత్త రికార్డు సాధించింది. తొలిసారి డ్రోన్‌ ద్వారా డోర్‌ డెలివరీ చేసింది. 400 అడుగుల ఎత్తులో ఎగురుతూ వెళ్లిన ఈ డ్రోన్‌ 13 నిమిషాల్లో వినియోగదారునికి ఆర్డర్‌ చేసిన వస్తువులను అందించింది. కేంబ్రిడ్జ్‌లోని ఒక వ్యక్తి ఆర్డర్‌ చేసిన పాప్‌కార్న్‌ ప్యాకెట్‌ను డ్రోన్‌ ద్వారా విజయవంతంగా డెలివరీ చేయగలిగామని ఆమెజాన్‌ సిబ్బంది తెలిపారు. డ్రోన్‌కు వస్తువును అటాచ్‌ చేయడం నుంచి డెలివరీ చేసే వరకూ వీడియో తీసిన అమెజాన్‌ దాన్ని విడుదల చేసింది. డిసెంబరు ఏడు నుంచి డ్రోన్‌ల ద్వారా డెలివరీ చేసే విధానాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టామని ఐదు పౌండ్ల బరువు వరకు ఉండే వస్తువులను 30 నిమిషాల్లోపే డెలివరీ చేయాలని నిర్ణయించుకున్నామని వారు వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com