చెన్నైలో అత్యవసరంగా దిగిన ఎమిరేట్స్ విమానం
- September 05, 2015
దుబాయ్ నుంచి కౌలాలంపూర్ కు బయలు దేరిన ఎమిరేట్స్ విమానం శనివారం చెన్నై విమానాశ్రయంలో అత్యవసర పరిస్థితుల్లో ల్యాండ్ అయ్యింది. దుబాయ్ నుంచి కౌలాలంపూర్ కు వెళుతున్న ఈకె -346 విమానంలో దుబాయ్ కి చెందిన 61 ఏళ్ల ప్రయాణికుడికి ఆకస్మాత్తుగా గుండెనొప్పి వచ్చింది. ఈ విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగానికి సమాచారం అందించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని ల్యాండింగ్ చేయాల్సిందిగా కంట్రోల్ రూమ్ కు ఆదేశాలు పంపారు. ఈమేరకు అధికారుల అనుమతితో విమానాన్ని చెన్నై విమానశ్రయంలో దింపివేశారు. బాధితుడికి తొలుత ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్టు అధికారులు పేర్కొన్నారు. ఆ తరువాత విమానం కౌలాలంపూర్ కు బయలుదేరింది.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







