సౌదీ-యెమన్ సరిహద్దుల్లో 5గురు బహ్రెయిన్ సైనికుల మృతి
- September 05, 2015
దక్షణ సౌదీ అరేబియాలో ఈ శుక్రవారం యుద్ధంతో అట్టుడుకుతున్న పొరుగు దేశమైన యెమన్ సరిహద్దు రక్షణకు నియోగించబడిన ఐదుగురు సైనికులు మరణించినట్టు తెలియవచ్చింది. గత మార్చి నుండి రియాద్ లో ప్రవాసముంటున్న యెమన్ అధ్యక్షుడు అబెద్రబ్బొ మన్సూర్ హాది నాయకత్వాన్ని తిరిగి నిలబెట్ట దానికి సౌదీ నేతృత్వంలో నడపబడుతున్న అరబ్ సంకీర్ణ సమితిలో బహ్రైన్ కూడా ఒక సభ్యదేశం; కాగా బహ్రైనీ సాయుధ దళం చేసిన ఒక ప్రకటనలో సదరు సైనికులు సౌదీ సామ్రాజ్యం యొక్క దక్షిణ సరిహద్దును కాపాడే యత్నంలో ప్రాణాలు కోల్పోయారని మాత్రమే ప్రకటించారు; అక్కడ పరిస్తితుల వివరాలు తెలియరాలేదు. ఇంకా, అదేరోజు తూర్పు యెమన్ లోని ఒక ఆయుధ డిపోలో జరిగిన ప్రేలుడులో, మరో సభ్యదేశమైన 22 మంది యూ. ఏ. ఈ. సైనికులు మృతిచెందారు. యెమన్ ప్రభుత్వం దాన్ని ప్రమాదవశాత్తూ జరిగిన ఘటన అని చెప్తుండగా, తిరుగుబాటు దళాలు, తాము చేసిన రాకెట్ దాడి ఫలితమని ప్రకటించాయి!
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







