ఖతార్ లో జులై నుండి పడిపోయిన సైకిల్ అమ్మకాలు - వ్యాపారుల దిగాలు
- September 05, 2015
ఖతార్ లో గత సంవత్సరాలతో పోలిస్తే ఈ జులై నెల నుండి సైకిల్ అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. ఈ సందర్భంగా ఒక స్పోర్ట్స్ మరియు సైకిల్ స్టోర్స్ సూపర్వైజర్ మాట్లాడుతూ, వేసవిలో అమ్మకాలు తగ్గడం సామాన్యమేనని, కానీ ఈసారి మరీ రోజుకు 5 కంటే తక్కువగా అమ్మకాలు జరగడం, ఎప్పుడూ లేదని వాపోయారు. దేశంలో సైకిల్ స్టోర్స్ సంఖ్య పెరగడంతో, వాటి మధ్య పోటీ పెరిగి వివిధ బ్రాండ్ల సైకిళ్లను తక్కువ రేటుకే అందించడం ఒక కారణమని ఆయన అన్నారు. ఇంకా చాలా కాలం నుండి సైక్లింగ్ చేస్తున్న వారు, తమ పాత సైకిళ్లను సోషల్ మీడియా ద్వారా అమ్మడం కూడా మరో కారణం గా కనిపిస్తోంది. మరో దుఖాన యజమాని మాట్లాడుతూ, వినియోగదారులు ఆన్ లైన్లో సైకిళ్లు కొంటున్నారనీ, వారిని ఆకర్షించడానికి తాము అనేక ప్రమోషన్ లు, ప్రత్యేక డిస్కౌంట్లు ఇస్తున్నామని, రానున్న శీతాకాలంలో తమ వ్యాపారం పుంజుకుంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







