3 రాష్ట్రాలలో ఎయిర్ అంబులెన్స్ సేవలు
- December 16, 2016
అత్యవసర సమయాల్లో రోగులకు వైద్య సేవలు అందించేందుకు, వారిని తరలించేందుకు 'ఏవియేటర్స్ ఎయిర్ రెస్క్యూ' సంస్థ చేపట్టిన గగనతల అంబులెన్స్ సేవలను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం బెంగళూరులో ప్రారంభించారు. ఈ అంబులెన్స్‌లతో దక్షిణాదిలోని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అత్యవసర సమయంలో రోగులకు సేవలు అందిస్తామని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ శర్మ తెలిపారు. 'ఎయిర్‌బస్ హెలికాప్టర్ హెచ్-130'లను గగనతల అంబులెన్స్‌లుగా వినియోగిస్తామని, రోగులకు అత్యవసర చికిత్స అందించేలా వీటిని రూపుదిద్దామని పేర్కొన్నారు.
''ప్రతి హెలికాప్టర్లో ఇద్దరు పైలట్లు, ముగ్గురు వైద్య నిపుణులు ఉంటారు. స్ట్రెచర్, ప్రాణవాయువు, ఇతర వైద్య ఉపకరణాలు ఉంటాయి. ప్రస్తుతానికి మూడు హెలికాప్టర్లు దక్షిణాదిలో ఎంపిక చేసిన స్థావరాలను కేంద్రాలుగా చేసుకుని సేవలు అందిస్తాయి'' అని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో ఇంపౌండ్ వాహనాల ఆన్లైన్ వేలం..!!
- గల్ఫ్ దేశాల భద్రతపై జీసీసీ పోలీస్ చీఫ్‌ల కీలక సమావేశం..!!
- దుబాయ్ ట్యాక్సీ డ్రైవర్ నిజాయితీ.. యూఏఈకి మకాం మార్చిన భారతీయ వ్యాపారి..!!
- సౌదీ అరేబియాలో ఏడు ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లపై చర్యలు..!!
- లోక్ భవన్లో 77వ టీబీ సీల్ విక్రయ కార్యక్రమాన్ని ప్రారంభించిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- గ్రామీణ కళాకారుల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- భారత్–ఒమన్ ఆర్థిక భాగస్వామ్యంపై కీలక చర్చలు..!!
- ప్రపంచ పర్యాటకులను భాగస్వాములుగా ఆహ్వానిస్తున్నాం: మంత్రి కందుల దుర్గేష్
- తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు..71.23 లక్షల మందికి చోటు
- హౌసింగ్ నిబంధనల ఉల్లంఘన.. 4 భవనాలకు విద్యుత్ కట్..!!







