30న విడుదల కానున్న 'ఇంకేంటి నువ్వే చెప్పు'

- December 18, 2016 , by Maagulf
30న విడుదల కానున్న 'ఇంకేంటి నువ్వే చెప్పు'

ప్రశాంత్‌, ప్రసన్న, సన్నీ, అక్షిత ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ఇంకేంటి నువ్వే చెప్పు'. శివ శ్రీ దర్శకుడు. మళ్ల విజయ్‌ ప్రసాద్‌ నిర్మాత. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో పాటల విజయోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ఒక వినూత్నమైన ప్రేమకథతో తెరకెక్కిన చిత్రమని పేర్కొన్నారు. ఇందులో ఎవరు ఎవరిని నువ్వే చెప్పు అని అడిగారో తెరపైనే చూడాలని నిర్మాత విజయ్‌ ప్రసాద్‌ అన్నారు. వికాస్‌ అందించిన పాటలకు మంచి స్పందన వస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన నిర్మాతలు సి.కల్యాణ్‌, కేఎస్‌ రామారావులు చిత్ర బృందానికి జ్ఞాపికలు అందజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com