రచయితపై రాజద్రోహం కేసు!
- December 18, 2016
జాతీయ గీతాన్ని అవమానిస్తూ ఫేస్ బుక్ లో పోస్టు చేసిన ఓ రచయితపై రాజద్రోహం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జాతీయగీతంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మళయాళీ రచయిత, థియేటర్ ఆర్టిస్ట్ కమల్ సీ చవరాను అరెస్టు చేసి విచారిస్తున్నట్లు చెప్పారు. గతంలో ఫేస్ బుక్ లో ఆయన చేసిన పోస్టులను కూడా పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.
కేరళ రాష్ట్ర బీజేపీ యువ మోర్చాకు చెందిన యూత్ వింగ్ ఈ మేరకు కమల్ పై కొల్లంలోని ఓ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. దీంతో కోజికోడ్ లో నివసిస్తున్న కమల్ ను అరెస్టు చేసి కొల్లంకు తీసుకువచ్చినట్లు చెప్పారు. తిరువనంతపురంలో జరిగిన అంతర్జాతీయ కేరళ ఫిల్మ్ ఫెస్టివల్(ఐఎఫ్ఎఫ్ కే)లో జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న సమయంలో లేచి నిలబడనందుకు 12మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!
- తెలంగాణకు కొత్త గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా..
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్









