పోర్టారికో భామకు ప్రపంచ సుందరి కిరీటం..

- December 19, 2016 , by Maagulf
పోర్టారికో భామకు  ప్రపంచ సుందరి కిరీటం..

ఈ ఏడాది ప్రపంచ సుందరి కిరీటాన్ని పోర్టారికోకు చెందిన 19 ఏళ్ల స్టెఫైన్‌ డెల్‌ వాల్లే కైవసం చేసుకుంది. ఇక్కడ నిర్వహించిన పోటీల్లో 116 మంది తోసిరాజని అగ్రస్థానంలో నిలిచింది. పోర్టారికో దేశానికి ఈ కిరీటం దక్కడం ఇది రెండోసారి. డొమినికన్‌ రిపబ్లిక్‌కు చెందిన యరిత్జా, ఇండోనేసియాకు చెందిన నటాషా రన్నరప్‌లుగా నిలిచారు. గతేడాది ప్రపంచసుందరిగా నిలిచిన స్పెయిన్‌ భామ మిరియా లాలాగుణ విజేతకు కిరీటాన్ని అందజేసింది. ఫైనల్‌కు పోటీ పడిన ఐదుగురిలో కెన్యా, ఫిలీప్పీన్స్‌ భామలు కూడా ఉన్నారు. విజేతగా నిలిచిన డెల్‌ వాల్లే తాను వినోద రంగంలోకి రావాలనుకుంటన్నట్లు వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com