డ్రగ్స్‌పై యుద్ధం అత్యవసరం: క్రౌన్ ప్రిన్స్
- December 19, 2016
రియాద్: పౌరుల్ని అలాగే నివాసితుల్ని నాశనం చేసే డ్రగ్స్ విషయంలో యుద్ధం అనివార్యం, అత్యవసరం అని నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ కమిషన్ ప్రెసిడెంట్, అలాగే క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ మొహమ్మద్ బిన్ నైఫ్ పునరుద్ఘాటించారు. నేషనల్ కమిషన్ ఫర్ డ్రగ్ కంట్రోల్ సమావేశంలో మాట్లాడిన మొహమ్మద్ బిన్ నైఫ్, డ్రగ్స్‌పై పోరు ఆవశ్యకతను తెలియజేశారు. వ్యక్తి యొక్క జీవితాన్ని నాశనం చేస్తుందని, సమాజంపై డ్రగ్స్ తీవ్ర ప్రభావం చూపించడం దారుణమని ఆయన అన్నారు. పోలీస్ అలాగే కస్టమ్స్ అధికారులు, స్మగ్లర్స్‌ని అరెస్ట్ చేయడం, డ్రగ్ డీలర్స్‌కి చెక్ పెట్టడం వంటి విషయాల్లో చూపుతున్న ప్రత్యేక శ్రద్ధను అభినందించారు. డ్రగ్స్‌కి వ్యతిరేకంగా అవగాహనా కార్యక్రమాల్ని ఇంకా ముమ్మరం చేయాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. నిబ్రాస్ అకాడమీ ఫర్ ఇ-ట్రెయినింగ్, నిబ్రాస్ స్పోర్ట్స్ స్టార్స్ మరియు నిబ్రాస్ అప్లికేషన్స్ అనే మూడు ఇ-ప్రోగ్రామ్స్‌ని క్రౌన్ ప్రిన్స్ ప్రారంభించారు. డ్రగ్స్‌పై యుద్ధంలో భాగంగా కస్టమ్స్ అలాగే పోలీసులు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని క్రౌన్ ప్రిన్స్ పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ ఆర్థిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- సౌదీలో ఐస్‌క్రీమ్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- కువైట్ ఫ్రైడే మార్కెట్లో తనిఖీలు.. 61 మంది అరెస్ట్..!!
- మలేషియాలో వర్షంలోనూ అదరగొట్టిన గల్ఫ్ ఎయిర్ ఫ్లైపాస్ట్..!!
- ఖతార్‌లో పిల్లల డిజిటల్ భద్రతపై ప్రత్యేక దృష్టి..!!
- మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకానికి ఆడపడచుల నీరాజనాలు
- కజకిస్థాన్‌కు బయలుదేరిన ఒమన్ సుల్తాన్..!!
- నాటక రంగానికి పూర్వవైభవం:సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్ స్కూళ్లలో ఫొటోలు, వీడియోలపై కొత్త నిబంధనలు..!!
- బిట్స్ పిలానీ–ఐఐటీ మద్రాస్ మధ్య ఐదేళ్ల భాగస్వామ్యం.. విద్యార్థుల ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్







