తెలుగు మహిళ మృతి పై పూర్తి కాని విచారణ
- December 20, 2016
పొట్టకూటి కోసం ఎడారి దేశం వచ్చి ఇక్కట్ల పాలయిన ఓ తెలుగు మహిళకు ఎట్టకేలకు విముక్తి లభించింది. సౌదీలోని శరణాలయంలో తలదాచుకుంటున్న ఆమెను సొంతఊరు పంపేందుకు ఓ ఎన్నారై సాయమందించారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు సమీపంలోని అంతర్వేదిపాలెం గ్రామానికి చెందిన అడిదేల శాంత కుమారి అనే మహిళ కుటుంబ పరిస్థితులు బాగాలేక ఉపాధి కోసం సౌదీ వెళ్లింది. అక్కడకు వెళ్లిన తర్వాత భాష రాక, యజమాని పెట్టే చిత్రహింసలు తట్టుకోలేకపోయింది. యజమానికి చెప్పకుండా పారిపోయింది. ఆ తర్వాత పోలీసుల ఆధ్వర్యంలో నడిచే ఓ మహిళా శరణాలయానికి వచ్చి కొంతకాలంగా బతుకు వెళ్లదీస్తోంది. ఆమె పరిస్థితిని గమనించిన అల్ ఖోబర్‌లో ఉండే ప్రవాసాంధ్రుడు, ఏపీ ఎన్నార్టీఎస్ కోఆర్డినేటర్ రావి రాధాకృష్ణా.. శాంత కుమారిని స్వస్థలానికి పంపించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. భారతీయ ఎంబసీ వాలంటీర్లు యజమానిని ఒప్పించి ఆమెపై కేసును ఉపసంహరించుకునేలా కృషి చేసి వీసా ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ ఇప్పించారు. సౌదీ నుంచి హైదరాబాద్‌కు వీసా టిక్కెట్టును రాధాకృష్ణ తీసుకున్నారు. వీరందరి సాయంతో శాంతకుమారి సోమవారం హైదరాబాద్‌కు చేరుకుంది. కాగా సౌదీలో ఆత్మహత్య చేసుకున్న చిత్తూరు జిల్లా కెవి పల్లె మండలానికి చెందిన ఎంబిలీ సుశీల అనే మహిళ మృతదేహాన్ని భారత్‌కు పంపించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రాధాకృష్ణ వెల్లడించారు. ఆమె ఆత్మహత్య గురించి కేసు ఇంకా పూర్తి కానందున మృతదేహాన్ని అధికారులు అప్పగించడం లేదన్నారు. కేసు పూర్తయి, పోలీసులు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత మృతదేహాన్ని స్వదేశానికి పంపించే ఏర్పాట్లు చేస్తామన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్‌లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో రెస్టారెంట్, ఫుడ్ గోడౌన్ సీజ్..!!
- బహ్రెయిన్‌లో మనీలాండరింగ్.. నలుగురు ఆసియన్లకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- వాహనదారులకు సుప్రీం కోర్టు బిగ్ షాక్..
- శబరిమల యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!







