రోడ్డు ప్రమాదం: ఒకరి మృతి మరొకరికి గాయాలు
- December 20, 2016
షార్జా: యూఏఈ మనీ ఎక్స్‌ఛేంజ్‌లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్ మృతి చెందిన ఘటన షార్జాలో చోటు చేసుకుంది. రోడ్డుపై ప్రయాణిస్తున్న ఓ వాహనం అదుపుతప్పి మనీ ఎక్స్‌ఛేంజ్‌లోకి దూసుకెళ్ళింది. ఈ ఘటనతో సెక్యూరిటీ గార్డ్ మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. బ్రేక్ వేయాల్సింది పోయి, యాక్సెలరేటర్‌పై డ్రైవర్ కాలు వేయడంతో కారు వాహనం అదుపు తప్పింది. ప్రమాద సమయంలో డ్రైవర్ పూర్తిగా డ్రైవింగ్ మీద దృష్టిపెట్టలేదని పోలీసు అధికారులు వెల్లడించారు. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. అదృష్టవశాత్తూ స్టాఫ్ ఎవరూ చనిపోవడంగానీ, గాయపడటంగానీ జరగలేదనీ, సెక్యూరిటీ గార్డ్ మృతి చెందడం అలాగే అటువైపుగా వెళుతున్న ఓ వ్యక్తి తీవ్ర గాయాల పాలవడం దురదృష్టకరమని యూఏఈ ఎక్స్‌ఛేంజ్ వర్గాలు చెప్పాయి.
తాజా వార్తలు
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్‌లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో రెస్టారెంట్, ఫుడ్ గోడౌన్ సీజ్..!!
- బహ్రెయిన్‌లో మనీలాండరింగ్.. నలుగురు ఆసియన్లకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- వాహనదారులకు సుప్రీం కోర్టు బిగ్ షాక్..
- శబరిమల యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!







