నేడు తిరుమలకు రానున్న శ్రీలంక ప్రధాని!
- December 20, 2016
శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమ సింఘే బుధవారం రెండు రోజుల పర్యటనకు తిరుపతి వస్తున్నట్లు కలెక్టర్ సిద్ధార్థజైన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధాని బుధవారం సాయంత్రం 4.15 గంటలకు చెన్నై నుండి హెలికాప్టర్లో బయలుదేరి రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. 15 నిమిషాల త ర్వాత విమానాశ్రయం నుండి కారులో రోడ్డు మార్గాన బయలుదేరి 5.30 గంటలకు తిరుపతి మీదుగా తిరుమల వెళ్తారు. శ్రీకృష్ణ అతిథిగృహంలో విడిది చేస్తారు. రాత్రి 7.30 గంటలకు అతిథిగృహం నుంచి బయలుదేరి ఆలయం చేరుకొని శ్రీవారిని దర్శించుకుంటా రు. రాత్రి బస చేస్తారు. గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకుంటారు.
అల్పాహారం అనంతరం 8.15 గంటలకు తిరుమల నుండి కారులో బయలుదేరి 9.15గంటలకు రేణిగుంట విమానాశ్ర యం చేరుకుంటారు. 9.30 గంటలకు విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో చెన్నై విమానాశ్రయానికి వెళతారని కలెక్టర్ తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







