బెర్లిన్‌లోని క్రిస్మస్‌ మార్కెట్లో ఉగ్రదాడికి పాల్పడింది మేమే: ఐసిస్‌..

- December 21, 2016 , by Maagulf
బెర్లిన్‌లోని క్రిస్మస్‌ మార్కెట్లో ఉగ్రదాడికి పాల్పడింది మేమే: ఐసిస్‌..

జర్మనీ రాజధాని బెర్లిన్‌లోని క్రిస్మస్‌ మార్కెట్లో జరిగిన ఉగ్రదాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్స్‌ స్టేట్స్‌ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేసింది. ఐసిస్‌ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న ఓ న్యూస్‌ ఏజెన్సీ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. అంతర్జాతీయ కూటమిగా ఏర్పడిన దేశాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడి చేసినట్లు ఐసిస్‌ ప్రకటించుకుంది.
అమెరికాతో కలిసి సిరియా, ఇరాక్‌పై దాడి చేస్తున్న ఐఎస్‌ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా జరిపే పోరాటంలో జర్మనీ భాగస్వామ్యం వహిస్తోంది. సోమవారం రాత్రి క్రిస్మస్‌ మార్కెట్లో ఉన్న పాదచారులపైకి ఓ నలుపు రంగు ట్రక్కు దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది.

ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా, 50 మంది గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ట్రక్కును నడిపిన పాకిస్థాన్‌కు చెందిన 23ఏళ్ల యువకుడిని జర్మనీ భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com