దేష్ తీవ్రవాద సంస్థకు మద్దతు ఇచ్చిన ఇరువురికి జైలుశిక్ష
- December 21, 2016
జెడ్డా: రియాద్ ప్రత్యేక నేర న్యాయస్థానం సోమవారం ఒక సౌదీ పౌరుడికి వ్యతిరేకంగా 10 సంవత్సరాల మరొక వ్యక్తికి వ్యతిరేకంగా ఆరు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ప్రాథమిక సూచనల ప్రకారం వీరు ఇరువురు దేష్ తీవ్రవాద సంస్థకు తమ మద్దతు ఇవ్వడంపై ఈ తీర్పు వెలువడింది. మొదటి ప్రతివాది ప్రమాదకర సామాగ్రి నిల్వ ఉంచి ప్రజల భద్రత మరియు స్థానిక జీవన క్రమం యొక్క స్థిరత్వంను దెబ్బతీసే యత్నంతో పాటు తన మొబైల్ ఫోన్ లో దేష్ తీవ్రవాద సంస్థకు మద్దతు అందుకు అనుబంధంగా ఆడియో మరియు విజువల్ వీడియోలు, మరియు టెక్స్ట్ సందేశాలను కలిగి ఉన్నాడని ఆరోపణ నమోదైంది. అంతేకాక మొదటి ప్రతివాది ఆరు బులెట్లు తో కూడిన ఒక తుపాకీ సైతం కొనుగోలు చేశాడు. తన ఆధీనంలో తొమ్మిది బుల్లెట్లు జప్తు చేశారు. ఎటువంటి లైసెన్స్ లేకుండా ఒకే ఆయుధాన్ని కొనుగోలు చేయడం మరో తీవ్రమైన నేరంగా కోర్టు భావిస్తుంది. ఈ నేరారోపణలు అనంతరం కోర్టు నిందితునికి 10 సంవత్సరాల జైలుశిక్ష విధించబడింది జైలు నుంచి విడుదలైన తర్వాత కింగ్డమ్ నుంచి ఏ దేశానికి ప్రయాణించరాదని ఆదేశం జారీ కాబడింది,.రెండవ ప్రతివాదికి సైతం ఆడియో మరియు విజువల్ వీడియోలు, అలానే టెక్స్ట్ సందేశాలను దేశ్ మద్దతు సామాగ్రీ కలిగి "టెలిగ్రాం" వేదిక, ద్వారా రెండు తీవ్రవాద గ్రూపులకు అనుసంధానకర్తగా వ్యవహరించాడు. దేశ్ సహాయకుడిగా పనిచేసినందుకు కోర్టు దోషిగా నిర్ధారించి ఆరేళ్ళ జైలుశిక్ష విధించింది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







