తరుణ్ అరోరానే కాటమరాయుడుకీ విలన్...

- December 22, 2016 , by Maagulf
తరుణ్ అరోరానే కాటమరాయుడుకీ విలన్...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా కాటమరాయుడు. గోపాల గోపాల ఫేం డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. పవన్ ఫ్యాక్షన్ లీడర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఓ బాలీవుడ్ నటుడు విలన్ గా నటించనున్నాడు.

చిరంజీవి రీ ఎంట్రీ సినిమాగా తెరకెక్కుతున్న ఖైదీ నంబర్ 150 లో విలన్ గా నటిస్తున్న తరుణ్ అరోరానే కాటమరాయుడులోనూ విలన్ గా నటిస్తున్నాడట. వీరమ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న కాటమరాయుడులో ఓ పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నాడు తరుణ్.

ముఖ్యంగా పవన్, తరుణ్ ల మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా నిలుస్తాయన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. ఈ సినిమాలో తరుణ్ అరోరాతో పాటు రావు రమేష్ కూడా విలన్ గా కనిపించనున్నాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com