ట్రక్కు అడుగు భాగంలో దాక్కొని ఇరువురు యు.ఏ.ఈ లో ప్రవేశ యత్నం
- December 22, 2016
మిఠాయి బుట్టలో దాక్కొని ..మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ రాజభటులకు మస్కా కొట్టి కారాగారం నుంచి తప్పించుకున్న కథ బహుశా వారికి ప్రేరణ అయిందేమో..దాదాపు అదే ఉత్సాహంతో ఇరువురు వ్యక్తులు యు.ఏ.ఈ లోనికి అక్రమ వలస కోసం వింత ప్రయత్నం చేశారు..అయితే వీరికి తుదకు వంటి నిండా మసి తో పాటు పలు కేసులు మాత్రమే మిగిలాయి. వీరు ఒక డ్రైవర్ సహకారంతో ట్రక్కు అడుగు భాగంలో టైర్లను దాచే స్థలంలో కిక్కురుమనకుండా నక్కి కూర్చొన్నారు. వారి ప్రణాళిక ప్రకారమే రహస్యంగా యు.ఏ.ఈ లోనికి ప్రవిశించారు. అయితే, ఎమిరేట్ ప్రయాణమై వెళుతున్న ఒక అరబ్ డ్రైవర్ వ్యవహారశైలి కదలికలపై అనుమానం కల్గిన అధికారులు మేజయాద్ కస్టమ్స్ కేంద్రంలో మానవ శోధన మరియు ఆధునిక డిటెక్టరలతో ట్రక్కు అంతా క్షుణ్ణంగా అబూధాబీ కస్టమ్స్ ఇన్స్పెక్టర్లు తనిఖీ చేశారు. వారి పరిశోధనలో ఎటువంటి గుర్తింపు పత్రాలు లేకుండా ట్రక్ అడుగు భాగం కింద విడి టైర్లు చాచే ప్రదేశంలో దాక్కొని ఉన్న ఇద్దరు అక్రమ వలసదారులను పట్టుకొన్నారు. అక్రమ వలసదారుల బదిలీ తరలింపునకు ప్రధాన సూత్రధారి డ్రైవర్ పై అవసరమైన అన్ని చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని కస్టమ్స్ అధికారులు నిర్ణయించారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







