ఖబడ్దార్ పన్ను ఎగవేస్తే..
- December 23, 2016
పన్ను ఎగవేతదారులపై ఐటీ శాఖ నిఘా పెంచుతోంది. 2014-15 సంవత్సరంలో భారీ ఎత్తున ఆర్ధిక లావాదేవీలు జరిపి కూడా 2015-16 సంవత్సరానికి తమ ట్యాక్స్ రిటర్న్ లు సమర్పించని మరో 68 లక్షల మందిని ఐటీ శాఖ గుర్తించింది. వీరిపై త్వరలో చర్యలు తీసుకోనుంది. వీరి సమాచారాన్ని బ్యాంకులు, ఇతర ఆర్ధిక సంస్థల నుంచి ఈ శాఖలోని నాన్-ఫైలర్స్ మానిటరింగ్ విభాగం సేకరించింది.
హై వాల్యూ లావాదేవీలు జరిపి కూడా తమ ఆదాయపు పన్ను వివరాలను దాఖలు చేయనివారిని గుర్తించడమే ఈ విభాగం పని. డేటా మ్యాచింగ్ లో ఇలాంటి వారిని సుమారు 68 లక్షల మందిని గుర్తించినట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తెలిపింది. వీరికి త్వరలో నోటీసులు జారీ చేయనున్నారు.
తమ అసలైన ఆదాయాన్ని వెల్లడించి సకాలంలో పన్నులు చెల్లించకపోతే ఖబడ్దార్ అని ఐటీ శాఖ హెచ్చరిస్తోంది.
తాజా వార్తలు
- తీవ్ర ఒత్తిడిలో ప్రపంచం..విదేశాంగ మంత్రి జైశంకర్ ఆవేదన
- ఇరాన్ కు అమెరికా మరో వార్నింగ్
- సౌదీలో భవన నిర్మాణ రంగం దూకుడు..!!
- ఇరాన్ దాడులకు మద్దతు కేసు..నిందితులకు షాకిచ్చిన కాసేషన్ కోర్టు..!!
- దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కు మంచిరోజులు వస్తాయి..భారత్‌లో పెట్టుబడులపై ఆసక్తి..!!
- కువైట్‌లో మండుతున్న ఎండలు.. ముగిసిన మిడ్ డే వర్క్ నిషేధం..!!
- రిమాల్ అల్ షర్కియాహ్ పర్యాటక ప్రాంత అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్..!!
- ‘ది న్యూయార్కర్’ కథనంపై తీవ్రంగా స్పందించిన ఖతార్..!!
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు







