డ్రగ్స్‌ స్మగ్లింగ్‌: వ్యక్తికి జీవిత ఖైదు

- December 23, 2016 , by Maagulf
డ్రగ్స్‌ స్మగ్లింగ్‌: వ్యక్తికి జీవిత ఖైదు

మనామా: సుప్రీం అపీల్స్‌ కోర్ట్‌, పాకిస్తానీ వ్యక్తికి జీవిత ఖైదు విధించింది. తన కాలి స్లిప్పర్స్‌లో రెండు కిలోల హెరాయిన్‌ని స్మగ్లింగ్‌ చేస్తూ పట్టుబడ్డాడు నిందితుడు. బహ్రెయిన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో మే నెలలో నిందితుడు చిక్కాడు. నిందితుడు పాకిస్తాన్‌లోని కరాచీ నుంచి వచ్చాడు. సాధారణ స్లిప్పర్స్‌ కంటే కాస్త ఎక్కువగా ఉన్నట్లు గుర్తించి, అతన్ని విచారించగా హెరాయిన్‌ బయటపడిందని కస్టమ్స్‌ అధికారి చెప్పారు. స్లిప్పర్స్‌తోపాటు అతను తీసుకొచ్చిన బ్యాగ్‌లోనూ హెరాయిన్‌ని గుర్తించారు కస్టమ్స్‌ అధికారులు. వీటి మొత్తం బరువు 2 కిలోగ్రాములు. హాషిష్‌ అనే డ్రగ్‌ని అతను తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. 5000 బహ్రెయినీ దినార్స్‌ జరీమానా కూడా విధించింది న్యాయస్థానం. జైలు శిక్ష ముగిసిన తర్వాత అతన్ని డిపోర్ట్‌ చేస్తారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com