దుబాయ్ కస్టమ్స్: డ్రగ్ స్మార్ట్ ఎన్సైక్లోపీడియా
- December 23, 2016
దుబాయ్ కస్టమ్స్ తాజాగా డ్రగ్ స్మార్ట్ ఎన్సైక్లోపిడియాని లాంఛ్ చేసింది. కస్టమ్స్ ట్రైనింగ్ సెంటర్ - దుబాయ్ కస్టమ్స్, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సహయకారంతో దీన్ని రూపొందించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ తరహా ఎన్సైక్లోపిడియా ఇదే మొట్టమొదటిది. వివిధ రకాలైన డ్రగ్స్‌కి సంబంధించిన సమాచారం, ఫొటోలు, వీడియోలు, ఉదాహరణలు ఇందులో పొందుపర్చబడ్డాయి. డ్రగ్స్ ధరలు, వాటిని ఎలా దొంగచాటుగా తరలిస్తారు వంటి విషయాల్ని కూడా తెలిపేలా ఎన్సైక్లోపిడియాని రూపొందించడం జరిగింది. దుబాయ్ కస్టమ్స్ డైరెక్టర్ అహ్మద్ మహబూబ్ ముసాబి మాట్లాడుతూ, సమాజంలో సెక్యూరిటీని, స్టెబిలిటీని మెయిన్‌టెయిన్ చేయడం కోసం ఎన్సైక్లోపిడియాని రూపొందించినట్లు చెప్పారు. ఈ ఎన్సైక్లోపిడియా ద్వారా అందరికీ డ్రగ్స్ పట్ల అవగాహన పెరుగుతుందని ఆయన అన్నారు. కస్టమ్ అధికారులకు శిక్షణ ఇప్పించడానికి కూడా ఇది ఎంతో ఉపయోగపడ్తుంది. ఈ ఎన్సైక్లోపిడియాకి సంబంధించి అనేక ట్రైనింగ్ కార్యక్రమాల్ని కూడా నిర్వహిస్తున్నట్లు కస్టమ్స్ ట్రైనింగ్ సెంటర్ - దుబాయ్ కస్టమ్స్ సీనియర్ మేనేజర్ డాక్టర్ షేక్ అల్ ఘాఫ్రి చెప్పారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







