ఇక అన్నిటికి ఆధార్ ఉంటే చాలు.!
- December 25, 2016
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆధార్ యాప్ ద్వారా చెల్లింపులను విశాఖపట్నంలో ఆదివారం ప్రారంభించనున్నారు. ఇది చాలా సులువు. దీనికి కేవలం ఆధార్ నంబర్, వేలి ముద్ర వుంటే చాలు. మన బ్యాంకు ఖాతా ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చు. ఎటువంటి కార్డులు అవసరం లేదు. పిన నంబర్లు అక్కర్లేదు. వ్యాపారులకు పోస్ యంత్రాలు అవసరం లేదు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే...ఈ లావాదేవీలపై ఎవరికీ ఎటువంటి రుసుము చెల్లించనక్కర్లేదు. ఎలా పనిచేస్తుందంటే...? ఇది మొబైల్ యాప్. విక్రయదారులు స్మార్ట్ఫోనతో పాటు బయోమెట్రిక్ మిషనను సమకూర్చుకోవలసి వుంటుంది. ఇది చాలా చిన్నగా కంప్యూటర్ మౌస్లా వుంటుంది.
దాన్ని యూఎ్‌సబీ సాయంతో ఫోనకు అనుంధానం చేసుకోవాలి. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆధార్ మొబైల్ యాప్‌ను డౌనలోడ్ చేసుకోవాలి. ఇక ఎవరైనా సరకుల విక్రేతకు సొమ్ము చెల్లించాలంటే...వారి స్మార్ట్‌ఫోనలో యాప్ ఓపెన చేయాలి. అందులో మొత్తం వివరాలు ఎంటర్ చేయాలి. ఆ తరువాత బయోమెట్రిక్ ద్వారా వేలిముద్ర ఇవ్వాలి. అప్పుడు యాప్‌లో బ్యాంక్ ఎంపిక చేసుకుని ఓకే చేయాలి. అంతే ఆ బ్యాంక్ ఖాతా నుంచి ఎంటర్ చేసిన మొత్తం విక్రేత ఖాతాలోకి వెళ్లిపోతుంది. ఇందులో పాస్వర్డ్ లేదు. కార్డ్ లేదు. ఏమీ లేదు. చాలా సులువుగా అయిపోతుంది. అయితే బ్యాంకులో తగినంత నగదు నిల్వ వుందో లేదో చూసుకోవాలి. ఇది కొత్త విధానం. దీన్ని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ నగరంలో ఆదివారం ప్రారంభించనున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్‌కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు









