రేణిగుంటలో బాలకృష్ణకు ఘన స్వాగతం..

- December 26, 2016 , by Maagulf
రేణిగుంటలో బాలకృష్ణకు ఘన స్వాగతం..

గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో రిలీజ్ కార్యక్రమం కోసం హీరో నందమూరి బాలకృష్ణ రేణిగుంట చేరుకున్నారు. అక్కడ బాలయ్యకు అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం సినిమా యూనిట్ సహా బాలకృష్ణ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం సాయంత్రం తిరుపతి మున్సిపల్ గ్రౌండ్స్‌లో ఆడియో రిలీజ్ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, బాలీవుడ్ నటి హేమామాలిని సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. 
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com