నాకు డాక్టరేట్ రావడం గర్వంగా ఉంది : షారూక్..

- December 26, 2016 , by Maagulf
నాకు డాక్టరేట్ రావడం గర్వంగా ఉంది : షారూక్..

బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్‌ డాక్టరయ్యారు. ఆయనకు నగరంలోని మౌలానా అజాద్ ఉర్దూ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్‌ ఇచ్చి సత్కరించింది. ఈ సందర్భంగా షారూక్ మాట్లాడుతూ డాక్టరేట్‌కు తాను అర్హుడినో కాదో తెలియదని, తనకు డాక్టరేట్ రావడం చాలా గర్వంగా ఉందని, యూనివర్శిటీ నుంచి ఇంత గొప్ప గౌరవం అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. తన తల్లి పుట్టిన హైదరాబాద్‌లో డాక్టరేట్ అందుకోవడం మరింత సంతోషాన్ని ఇస్తుందని షారూక్ చెప్పారు. తన తల్లిదండ్రులు ఉంటే ఎంతో సంతోషించేవారని, తన తండ్రి ఉర్దూభాషాభిమాని అని షారూక్ ఖాన్ పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com