ప్రపంచంలోనే అతిపెద్ద క్రిస్మస్ చెట్టు ఇది
- December 26, 2016
క్రిస్మస్ పండుగ సందర్భంగా శ్రీలంకలో ఏర్పాటుచేసిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రిస్మస్ చెట్టు ఇది. ఈ చెట్టు ఎత్తు సుమారు 73మీటర్లు. 6 లక్షల ఎల్ఈడీ లైట్లతో ఈ చెట్టును అలంకరించారు.
సుమారు నాలుగు నెలలపాటు వందలాది మంది శ్రమించి దేశ రాజధాని కొలంబోలో ఈ చెట్టును ఏర్పాటు చేశారు. దీని తయారీకి స్టీల్ వైర్ ఫ్రేమ్‌లను ఉపయోగించారు. దీన్ని ప్లాస్టిక్ నెట్‌తో అలంకరించి.. సుమారు ఒక మిలియన్ సహజ పైన్ కోన్స్‌ను గోల్డ్, సిల్వర్, గ్రీన్ రంగులద్ది అమర్చారు. 73మీటర్ల ఈ చెట్టుపై విద్యుద్దీపకాంతులతో ఆరుమీటర్ల నక్షత్ర ఆకారాన్ని ఉంచారు.ఈ చెట్టు తయారీకి సుమారు 80వేల డాలర్లు ఖర్చు చేసినట్లు సిబ్బంది తెలిపారు.
ప్రజల సొమ్మును అనవసరంగా ఖర్చు చేస్తున్నారంటూ పలువురు అభిప్రాయపడ్డారు. స్పందించిన ఆ దేశ ప్రధాని ఇది ప్రజల డబ్బు కాదని.. ప్రైవేటు సంస్థల నుంచి వచ్చిన విరాళాల ద్వారా దీన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీని ద్వారా ప్రపంచానికి మనమంతా ఒకే జాతి, ఒకే దేశం అన్న సందేశాన్ని ఇస్తున్నట్లు మాజీ క్రికెటర్, మంత్రి అర్జున రణతుంగ అన్నారు.
గత సంవత్సరం చైనాలో ఏర్పాటు చేసిన 55 మీటర్ల ఎత్తుగల క్రిస్మస్ చెట్టు ప్రపంచంలోనే అతి పెద్ద క్రిస్మస్ చెట్టుగా రికార్డుల్లో చోటు సంపాదించింది.
తాజా వార్తలు
- దుబాయ్–టెల్ అవీవ్ ఫ్లై దుబాయ్ విమానంలో ఘటన
- భారత్–ఖతార్ ఆర్థిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- పోలీసింగ్‌లో నాయకత్వం ఎంతో కీలకం: తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్
- సిరిసిల్లలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం: సీఎం రేవంత్
- గ్రీన్ ఎనర్జీ కోసం కేంద్రం కొత్త పథకం
- షార్జాలో 58వ వాచ్ అండ్ జ్యువెలరీ మిడిల్ ఈస్ట్ షో ప్రారంభం
- దుబాయ్‌లో తొలి ఎతిహాద్ రైల్ స్టేషన్ ప్రారంభం
- హైదరాబాద్ విమానాశ్రయంలో DRI భారీ ఆపరేషన్
- అక్టోబర్ 2 నుంచి ‘సేవ్ డెమొక్రసీ మార్చ్’.. ఇండియా కూటమి కీలక నిర్ణయం
- నమో భారత్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్..







