దుబాయ్‌లో రోడ్డు ప్రమాదాలు: 28 మందికి గాయాలు..
- December 26, 2016
దుబాయ్‌లో చోటు చేసుకున్న రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 28 మంది గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. మొదటి రోడ్డు ప్రమాదంలో 26 మంది గాయపడగా, రెండో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. ఎమిరేట్స్ రోడ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నాలుగు కార్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఏడుగురు ఓ మోస్తరు గాయాలతో బయటపడ్డారు. మిగిలినవారికి చిన్న చిన్న గాయాలయ్యాయి. ఉదయం 6.40 నిమిషాల సమయంలో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మిట్‌సుబిషి వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి ఈ ప్రమాదానికి కారణమయ్యాడు. మరో రోడ్డు ప్రమాదం తెల్లవారుఝామున 5 గంటలకు జరిగింది. వాహనాన్ని అతివేగంగా నడుపుతూ ఎలక్ట్రిసిటీ పోల్‌ని ఢీకొన్నాడు డ్రైవర్. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని రసీద్ ఆసుపత్రికి తరలించారు. వాహనదారులు వాహనాల్ని నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలనీ, వేగ నియంత్రణ పాటించాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







