స్కూల్‌ బస్‌పై గన్‌మెన్‌ ఎటాక్‌ - సెక్యూరిటీ డ్రిల్‌ మాత్రమే..

- December 26, 2016 , by Maagulf
స్కూల్‌ బస్‌పై గన్‌మెన్‌ ఎటాక్‌ - సెక్యూరిటీ డ్రిల్‌ మాత్రమే..

రస్‌ అల్‌ ఖైమాలో సెక్యూరిటీ ఫోర్సెసస్‌ నిర్వహించిన డ్రిల్‌ ఉత్కంఠభరితంగా సాగింది. ఈ డ్రిల్‌లో స్కూలబ్‌ బస్‌ని సాయుధులు చుట్టుముట్టారు. వేగంగా వెళుతున్న స్కూల్‌ బస్‌ ఆగే సమయంలో మూడు వాహనాల్లో వచ్చిన సాయుధులు ఆ బస్సుని చుట్టుముట్టారు. పది మంది బస్సుని చుట్టుమట్టగా అందులో ఓ వ్యక్తి బస్సులోకి వెళ్ళేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఫ్లాష్‌లతో కూడిన శబ్దాలు విన్పించాయి. అలాగే దట్టంగా పొగ కూడా కన్పించుకుంది. పది మంది సాయుధుల టీమ్‌ రెండుగా చీలిపోయింది. ఓ టీమ్‌ బస్సులోకి ప్రవేశించగా, మరో టీమ్‌ ఆ బస్‌కిరక్షణగా నిలిచింది. సేఫ్టీ మరియు సెక్యూరిటీ కోసం ఈ డ్రిల్స్‌ నిర్వహిస్తున్నారు. అక్టోబర్‌లో దోబాయ్‌ పోలీసులు, నిరసనలు వ్యక్తం చేస్తున్నవారిని అదుపులోకి తీసుకోవడంపై మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. మాల్స్‌, కార్యాలయాలు, రెసిడెన్షియల్‌ బిల్డింగ్స్‌లో ఈ తరహా డ్రిల్స్‌ సాధారణమే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com