త్వరలో మెట్రో రైలు పరుగులు విజయవాడ లో..

- December 27, 2016 , by Maagulf
త్వరలో మెట్రో రైలు పరుగులు  విజయవాడ లో..

విజయవాడ మెట్రో రైల్ విషయంలో ప్రభుత్వం వేగంగా ముందుకు వెళ్తోంది. ఇప్పటికే ప్రాజెక్ట్ నిర్మాణానికి ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ టెండర్లు పిలిచింది. తాజాగా వచ్చే ఐదేళ్లకు అవసరమైన నిధులను లోన్ల రూపంలో తీసుకునేందుకు లభించింది. విజయవాడ లో త్వరలో మెట్రో రైలు పరుగులు పెట్టనుంది. అమరావతి మొదటి దశ నిర్మాణం పూర్తయ్యేలోగా... మెట్రో రైలు మొదటి దశ పూర్తి చేయాలని ప్రభుత్వం ధృడసంకల్పంతో ఉంది.2018 కల్లా తొలి దశ పూర్తి చేయడం టార్గెట్‌గా పనుల్లో వేగం పెంచింది. ఇప్పటికే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌కు ఏపీ ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. రెండు కారిడార్లకు సంబంధించి DMRC ఇప్పటికే టెండర్ నోటిఫికేషన్‌ కూడా జారీ చేసింది. విజయవాడ మెట్రోకు కేంద్రం నిధులు సమకూరస్తుండగా.. రాష్ట్రప్రభుత్వం 20 శాతం నిధులు భరించాల్సి ఉంది. తాజాగా ఏపీ సర్కార్ వాటాపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. వచ్చే ఐదేళ్లకు మొత్తం 2వేల159 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది.ఇప్పటికే 300 కోట్లు విడుదల చేసినందున ఇంకా 18వందల 59 కోట్లు అవసరం అని లెక్క వేసింది.ఈ మొత్తాన్ని హాడ్కో లేదా ఇతర బ్యాంకుల నుంచి మూడేళ్ళలో చెల్లించేలా ఋణం తీసుకునేందుకు అమరావతి మెట్రో కార్పొరేషన్ కు అనుమతినిచ్చింది. ఈ రుణానికి ప్రభుత్వం గారంటీ ఇచ్చింది. రాష్ట్ర నిధులపై క్లారిటీ రావడంతో త్వరలోనే కేంద్ర నిధులపైనా స్పష్టత వస్తుందని అధికారులు భావిస్తున్నారు. అయితే గతంలో జైకా వంటి సంస్థలతో రుణాల కోసం ప్రయత్నం చేసినా...నిబంధనలు అడ్డుపడటంతో హాడ్కో నిధులతో మెట్రో పనులు వేగం కానున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com