ఐసీఐసీఐ బ్యాంకు 'ఈజీ పే' యాప్ ప్రారంభం

- December 27, 2016 , by Maagulf
ఐసీఐసీఐ బ్యాంకు 'ఈజీ పే' యాప్ ప్రారంభం

ఐసీఐసీఐ బ్యాంకు వ్యాపారుల కోసం రూపొందించిన 'ఈజీ పే' యాప్‌ను ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా వినియోగదారుల నుంచి వ్యాపారులు ఎంత మొత్తమైనా డిజిటల్ పద్ధతిలో స్వీకరించవచ్చు. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ ఆధారంగా పనిచేసే ఈ యాప్.. క్రెడిట్, డెబిట్, ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఐసీసీఐ డిజిటల్ వాలెట్ 'పాకెట్' నుంచి చెల్లింపులు జరిపేందుకు వీలు కల్పిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంకు కరెంట్ ఖాతాదారులు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని వాడవచ్చు.ఇతర బ్యాంకుల వినియోగదారులు కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ ఓఎస్ స్మార్ట్ ఫోన్లపై ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకురాగా, త్వరలో ఐఓఎస్ ఫోన్లకు ప్రవేశపెట్టనున్నారు.ఒక వ్యాపారికి సంబంధించి 30 మంది ఉద్యోగులు ఒకేసారి ఈ యాప్ ద్వారా తమ మొబైల్ ఫోన్లలో చెల్లింపులను స్వీకరించవచ్చని ఐసీఐసీఐ సీఈవో చందా కొచ్చర్ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com