పాక్లో కల్తీ మద్యం సేవించి 32 మంది మృతి..
- December 27, 2016
పాకిస్థాన్లో కల్తీ మద్యం సేవించి 32 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. టొబా టెక్ సింగ్ నగరంలోని ఓ క్రైస్తవ కాలనీలో ఈ విషాదం జరిగింది. క్రిస్మస్ పండుగ ముందు రోజు రాత్రి వేడుకలో భాగంగా.. కొందరు వ్యక్తులు తయారు చేసిన మద్యాన్ని స్థానికులు సేవించారు. సోమవారం ఉదయానికి వారిలో కొందరు ప్రాణాలు విడవగా.. మరికొంత మంది ఆసుపత్రిపాలయ్యారు. బాధితుల్లో ఎక్కువ మంది క్రైస్తవులే. ఘటనపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. సదరు మద్యం తయారు చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాక్లో మద్య నిషేధం అమలులో ఉన్నప్పటికీ ఇస్లాం మినహా ఇతర మతస్థులకు కొన్ని సడలింపులున్నాయి.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక
- సీనియర్ సిటిజన్లకు ఉచిత ఆర్టీసీ బస్ పాసులు..పరిశీలనలో ప్రభుత్వం!
- సైన్ బోర్డు పై హిందీ పదాలు..ఇద్దరు ఇంజనీర్లను సస్పెండ్ చేసిన తమిళనాడు ప్రభుత్వం!
- దేశ నిర్మాణంలో నిర్మల సీతారామన్ కీలక పాత్ర.. సీఎం చంద్రబాబు ప్రశంసలు
- భారతి మాతాజీ అస్తమయం
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!







