కేరళ విమానాశ్రయాల వెబ్సైట్లు హ్యాక్ చేసిన పాక్ హ్యాకర్ల!
- December 28, 2016
కొచ్చిన్, తిరువనంతపురం విమానాశ్రయాల వెబ్సైట్లు హాక్కు గురయ్యాయి. పాకిస్థాన్ సైబర్ అటాకర్స్ గ్రూప్ పేరిట ఈ హ్యాకింగ్ పాల్పడ్డారు. 'we are unbeatable.. mess with the best die like the rest' అనే సందేశాన్ని కూడా పోస్ట్ చేశారు.
అంతేగాక, ఈ వెబ్సైట్లు 'కాశ్మీరీ చీతా'చే హ్యాకింగ్ చేయబడ్డాయని పేర్కొన్నారు హ్యాకర్లు. హ్యాకింగ్ విషయం బుధవారం వెలుగులోకి వచ్చిన వెంటనే దీనిపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టారు. సైబర్ సెక్యూరిటీ అధికారులు దీనిపై నిశితంగా పరిశీలిస్తున్నారు.
హ్యాకింగ్ వెనక ఎవరున్నారనే విషయం ఇప్పటి వరకు తెలియరాలేదని ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు..
కేరళ వన్ఇండియాకు తెలిపారు. www.cochinairport.com and trivandrumairport.com ఈ రెండు వెబ్ సైట్లు హ్యాకింగ్‌కు గురయ్యాయి.
కాగా, ఈ వెబ్సైట్లను పునరుద్ధరించే పనిలో ఉన్నారు అధికారులు. విమానాల రాకపోకలకు సంబంధించిన అన్ని వివరాలు ఈ వెబ్సైట్లలో ఉన్నందున దీన్ని కొంత ఆందోళన చెందే అంశంగా అధికారులు భావిస్తున్నారు. హ్యాకింగ్ చేసిన వాళ్లు స్థానికులు కాదని సైబర్ సెక్యూరిటీ అధికారులు చెబుతున్నారు. కేరళ బయటి నుంచే ఈ హ్యాకింగ్ జరిగిందని చెప్పారు. మొదట వెబ్సైట్లను పునరుద్ధరించిన అనంతరం హ్యాకర్ల పనిపడతామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక
- సీనియర్ సిటిజన్లకు ఉచిత ఆర్టీసీ బస్ పాసులు..పరిశీలనలో ప్రభుత్వం!
- సైన్ బోర్డు పై హిందీ పదాలు..ఇద్దరు ఇంజనీర్లను సస్పెండ్ చేసిన తమిళనాడు ప్రభుత్వం!
- దేశ నిర్మాణంలో నిర్మల సీతారామన్ కీలక పాత్ర.. సీఎం చంద్రబాబు ప్రశంసలు
- భారతి మాతాజీ అస్తమయం
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్‌లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!







