జాకీచాన్‌పై వదంతులు..

- December 28, 2016 , by Maagulf
జాకీచాన్‌పై వదంతులు..

హాం గ్‌కాంగ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ నటుడు, గాయకుడు, స్టంట్‌మ్యాన్‌, దర్శక నిర్మాత జాకీచాన్‌ చనిపోయారంటూ చాలా సార్లు వార్తలు రావడం పరిపాటి అయిపోయింది. ఈమధ్య ఇలాంటి వార్త మరొకటి అంతర్జాలంలో వచ్చింది. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ లాండ్‌లో కారు ప్రమాదంలో జాకీ మరణించాడని ఒక చైనీస్‌ బుల్లెటిన్‌లో ప్రచురితమైనట్లు మరొక ఇంగ్లీషు పత్రిక పేర్కొంది. ఆఖరికి దీనిపై జాకీచాన్‌నే సంప్రదించాల్సి వచ్చింది. 'నేను బ్రతికే వున్నాను' అంటూ జాకీ నిర్థారించాడు. ఇదే విధమైన వార్త 2013లో కూడా వెలువడింది. జాకీచాన్‌ కుంగ్‌ఫూ, హాప్కిడో వంటి ఆత్మరక్షణ క్రీడల్లో నిష్ణాతుడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com