ఆర్బీఐ ఐడీ కార్డ్ చూపించి..!
- December 28, 2016
ఆర్బీఐ నుంచి వస్తున్నాం.. తాళం తీయండి.. అంటూ కాస్త గట్టిగా మాట్లాడితే ఎవ్వడైనా జడుసుకుని తీరాల్సిందే. బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు, బంగారం తాకట్టు పెట్టుకునే వాళ్ళు కాలింగ్ బెల్ సౌండ్ వినబడితే ఉలిక్కిపడే సీజన్ ఇది. సంగారెడ్డి జిల్లా బీరంగూడలోని ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీలో జరిగిన ఓ దోపిడీ దీనికి పరాకాష్ట.
స్కార్పియోలో దిగిన ఐదుగురు ఆగంతకులు ఆర్బీఐ వాళ్లమని చెప్పి.. ఏకంగా 45 కిలోల బంగారం మూట గట్టుకుని వెళ్ళిపోయిన ఘటన హైదరాబాద్ లో తాజా సంచలనం. అవాక్కయిన సిబ్బంది.. తర్వాత తేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబరాబాద్ కమిషనర్ శాండిల్య ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు మొదలుపెట్టారు. ఇదే ప్రాంతంలో ఫిన్ కార్ప్ సంస్థలో కూడా ఇదేవిధంగా చోరీ జరిగింది.
ఉత్తరాది దొంగల పనేనని పోలీసులు భావిస్తున్నారు. తెల్ల చొక్కా వేసుకుని టై సర్దుకుంటూ లోపలికొచ్చే ప్రతివాళ్ళను ఆర్బీఐ వాళ్ళనో , ఐటీ వాళ్ళనో భ్రమిస్తే.. ఆనక మూల్యం చెల్లించుకోక తప్పదు మరి.
తాజా వార్తలు
- పోస్టల్ పార్సిల్ .. గాజు కప్పుల్లో 40 వేల యాంఫెటమైన్ పిల్స్..!!
- అల్ ఖోర్ పోర్టులో నౌకలో అగ్నిప్రమాదం..!!
- మస్కట్‌లో ఉత్సాహంగా ‘వికసిత్ భారత్’ సాలిడారిటీ రన్..!!
- అబుదాబి-దుబాయ్ మధ్య వీకెండ్లో అదనంగా 6 రైళ్లు..!!
- అబుదాబిలో భారతీయ ప్రవాసిని వరించిన Dh25,000 బహుమతి..!!
- తైఫ్-రియాద్ హైవేపై ఘోరం.. ఐదుగురు టీచర్లు సహా ఆరుగురు మృతి..!!
- మనీ లాండరింగ్ కేసులో 8 మంది ప్రవాసులకు 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- సుస్థిర భవిష్యత్తుకు బహ్రెయిన్‌లో కొత్త కేంద్రం..!!
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక







