తిరుమల చేరుకున్న రాష్ట్రపతి..

- December 28, 2016 , by Maagulf
తిరుమల చేరుకున్న రాష్ట్రపతి..

తిరుమల వెంకటేశ్వరస్వామి వారి దర్శనం నిమిత్తం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కొద్దిసేపటి క్రితం తిరుమలకు చేరుకున్నారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతి... అక్కడి నుంచి నేరుగా తిరుచానూరు వెళ్లి పద్మావతి అమ్మవారిని దర్శించుకుని తిరుమల చేరుకున్నారు. రాష్ట్రపతి వెంట గవర్నర్‌ నరసింహన్‌ ఉన్నారు. రాష్ట్రపతికి టీటీడీ ఈవో సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు స్వాగతం పలికారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com