శాంతి, సహనం ఆవశ్యకతను నొక్కి చెప్పిన బహ్రెయిన్ అధినేత

- September 08, 2015 , by Maagulf
శాంతి, సహనం ఆవశ్యకతను నొక్కి చెప్పిన బహ్రెయిన్ అధినేత

బహ్రెయిన్ అధినేత హిజ్ మాజెస్టీ కింగ్ హమాద్ గత రాత్రి ఫ్రాన్స్ దేశం నుండి వచ్చిన మత బోధకులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బహ్రైన్ మరియు ఫ్రాన్స్ దేశాల మధ్య వెళ్ళూనుకున్నా దృఢసంబంధాల పట్ల తమ గర్వాన్ని వ్యక్తం చేస్తూ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయీస్ హాల్యాండ్ తో తన సమావేశం పరస్పర సహకారానికి కొత్త దారులు తెరుస్తుందని ఆయన తెలిపారు. పురాతన కాలం నుండి బహ్రైన్ యొక్క విధానమైన మతపరమైన మరియు సాంస్కృతిక వైవిధ్యం , వివిధ నాగరికతలకు, సంస్కృతులకు, సహనానికి, సౌభ్రాతృత్వానికి, ఈవిధమైన ఏ వివక్ష లేకుండా అందరినీ ఆదరించగల  కేంద్రమని వివరించారు.

 

--యం.వాసుదేవ రావు (మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com