రషీద్‌ హాస్పిటల్‌లో థంబ్‌ రీ-ఇంప్లాంట్‌..

- December 28, 2016 , by Maagulf

టగ్‌ ఆఫ్‌ వార్‌ అనే గేమ్‌ ఓ మహిలను ఆసుపత్రిలో చేర్చింది. అది కూడా ఆమె తన బొటని వేలిని కోల్పోయే ప్రమాదాన్ని తీసుకొచ్చింది. ఆసుపత్రిలో చేరిన ఆ మహిళకు రషీద్‌ హాస్పిటల్‌ వైద్యులు, విజయవంతంగా థంబ్‌ రీ-ఇంప్లాంట్‌ చేశారు. మెటల్‌ వైర్‌తో ఈ సర్జరీ చేశారు. కొన్ని రోజుల తర్వాత మెటల్‌ వైర్‌ తొలగిస్తామనీ, ఆ తరువాత కొన్ని రోజులకు ఆమె తిరిగి తన వేలిని యధాతథంగా ఉపయోగించగలదని రషీద్‌ హాస్పిటల్‌ హ్యాండ్‌ యూనిట్‌ డాక్టర్‌ ఖాలిద్‌ అల్‌ అవది చెప్పారు. సుమారు ఆరు గంటలపాటు సర్జరీని నిర్వహించినట్లు వైద్యులు వెల్లడించారు. మెటల్‌ వైర్‌ని తొలగించిన తర్వాత ఆమెకు ఫిజియో థెరపీని అందిస్తారు. రషీద్‌ హాస్పిటల్‌లో మంచి అనుభవంగల సర్జన్స్‌ హ్యాండ్‌ స్పెషలిస్ట్‌లుగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com