జనవరి 1 నుంచి మొబైల్ వెండర్స్‌కి లైసెన్స్‌లు ..
- December 28, 2016
మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ అండ్ కామర్స్, వెహికిల్ వెండర్స్‌కి సంబంధించి 12 ఖాళీలకుగాను లైసెన్స్ కోసం అప్లయ్ చేసుకోవచ్చని ప్రకటించింది. ఈటరీ, ఐస్ క్రీమ్ పార్లర్, టైర్ రిపేర్ మరియు బ్యూటీ సెలూన్లకు సంబంధించిన వ్యాపారాలు ఇందులో ఉన్నాయి. వీటిల్లో ఐదు ఫుడ్ రిలేటెడ్ యాక్టివిటీస్. నాలుగు రిపేర్ మరియు మెయిన్టెనెన్స్ అలాగే రిపేరింగ్ టైర్స్‌కి సంబంధించినవి, హోమ్ మెయిన్టెనెన్స్ (కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, బ్లాక్ స్మిత్) విభాగాల్లో ఉన్నాయి. మూడు యాక్టివిటీస్ పురుషుల, మహిళల సెలూన్ అలాగే టైలరింగ్ షాప్ (మహిళలు, పురుషులకు) ఉన్నాయి. ఈటరీ వెహికిల్‌కి ఖచ్చితంగా ఫైర్ డిటెక్షన్ సిస్టమ్ కలిగి ఉండాలి. వెండర్ వెహికిల్ లైసెన్స్ కోసం ఖచ్చితంగా కమర్షియల్ రిజిస్ట్రేషన్, రోడ్ పర్మిట్, హెల్త్ సర్టిఫికెట్ వంటివి తప్పనిసరి. ఈటరీ వెహికిల్సకి ఫైర్ డిటెక్షన్ సిస్టమ్, ఫైర్ బ్లాంకెట్, ఫైర్ ఎగ్జిటింగ్విషర్ వంటివి ఉండాలి. మినిస్ట్రీ ఆఫ్ మునిసిపాలిటీ మరియు ఎన్విరాన్మెంట్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. మినిస్ట్రీకి సంబంధించిన వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 1 వరకూ అప్లికేషన్లు స్వీకరించబడ్తాయి. ఫిబ్రవరి 8వ తేదీన విజేతల వివరాలు వెల్లడిస్తారు. ఫైనల్ అప్రూవల్‌ని ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఇస్తుంది.
తాజా వార్తలు
- ఎన్ఆర్ఐలకు డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఉన్నత విద్యకు ప్రత్యేక అవకాశాలు
- తెలంగాణలో బతుకమ్మ సందడి..
- మెన్స్ హాకీ ఫైనల్లో భారత్ ఘన విజయం
- ఫ్లై దుబాయ్ పైలట్ స్మిత్ మచ్ఛర్‌ను పరామర్శించిన షేక్ హమ్దాన్దు
- బహ్రెయిన్ అంతర్జాతీయ మ్యూజిక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- యూఏఈలో ట్రక్కుల సేవలు, ఫుడ్ డెలివరీ ఛార్జీలు పెరుగుతాయా?
- మక్కా గ్రాండ్ మసీదులో సూసైడ్ బాంబర్ ప్రచారం ఫేక్..!!
- హత్య కేసు ఆధారాలు చెరిపేసే ప్రయత్నం.. వ్యక్తి డిపోర్టేషన్..!!
- డుక్మ్ స్పేస్‌పోర్ట్.. ‘అజాద్ డ్రీమర్’ రాకెట్ ప్రయోగం సక్సెస్..!!
- హార్ముజ్ జలసంధిలో రెండు చమురు ట్యాంకర్లపై దాడి..!!







