ఐదు భారత్ రాష్ట్రాల్లో ఎన్నికలు ...

- December 28, 2016 , by Maagulf
ఐదు భారత్ రాష్ట్రాల్లో ఎన్నికలు ...

కొత్త ఏడాది 2017లో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ మరో రెండు రోజుల్లో విడుదలయ్యే అవకాశముంది. కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై కసరత్తు చేస్తోంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల ఎన్నికల తేదీలను జనవరి 2లోగా వెల్లడించనున్నట్లు సమాచారం. డిసెంబర్ 30న జరగనున్న ఈసీ కీలక సమావేశంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించవచ్చని తెలుస్తోంది.

యూపీలో ఏడు దశల్లో, మిగతా నాలుగు రాష్ట్రాల్లో ఒక దశలో ఎన్నికలు జరగవచ్చని సమాచారం. పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో మార్చి 18న, ఉత్తరాఖండ్‌లో మార్చి 26న, ఉత్తరప్రదేశ్‌లో మే 27న ఐదేళ్ళ పరిపాలన ముగియనుంది.
ఈ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు, సెక్యూరిటీ ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com